News July 19, 2024
MBNR: తొలి రోజు 647 మంది హాజరు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కేవలం రెండు కేంద్రాలను మాత్రమే అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ పాతిమా విద్యాలయం, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు నిర్వహించిన పరీక్ష కేంద్రాలకు 647 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 81 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ప్రతి రోజు 728 మంది అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండూ పూటలు పరీక్షలు నిర్వహించనున్నారు.
Similar News
News December 13, 2024
పాలమూరుకు మంత్రి పదవి దక్కేనా..?
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రస్తుతం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో పాలమూరు నుంచి పలువురి మంత్రి పదవి అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి బెర్తు దక్కుతుందా..? కామెంట్ చేయండి
News December 13, 2024
గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సంతోష్
15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు, రోజుకు 2 దఫాలుగా పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 25 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2024
ఉమ్మడి జిల్లాలోని నేటి..TOP NEWS!
❤MBNR: రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ రెడ్డి
❤అయిజ: Way2News ఎఫెక్ట్.. నిత్యవసర సరుకులు అందజేత
❤లగచర్ల రైతు చేతికి బేడీలు.. KTR అభ్యంతరం
❤14న లోక్ అదాలత్
❤NGKL:రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤లగచర్ల కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ
❤గ్రూప్-2 పరీక్ష.. నిర్వహణపై ప్రత్యేకంగా నిఘా
❤GDWL:రేపు జాబ్ మేళా
❤కొనసాగుతున్న సీఎం కప్పు క్రీడలు
❤ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ