News April 8, 2025
MBNR: దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపుహాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం దరఖాస్తులు ఆ వారమే పరిష్కరించాలని పదేపదే హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు.
Similar News
News April 17, 2025
మహబూబ్‌నగర్: ‘ఈనెల 17 నుంచి 29 వరకు అవగాహన కార్యక్రమాలు’

ఈనెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాలను మండలాల వారీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. ముందుగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జడ్చర్లలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు.
News April 17, 2025
SUPER.. గిన్నిస్ రికార్డ్ కొట్టిన మహబూబ్‌నగర్ అమ్మాయి

మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన టి.సత్యం గౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె టి.హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గాను, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు.
News April 17, 2025
మహబూబ్‌నగర్: అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.