News November 24, 2024
MBNR: దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జీలుగా మన జిల్లా నాయకులు
ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జీలుగా మహబూబ్ నగర్ నేతలను నియమించారు. వికారాబాద్ జిల్లా ఇన్‌ఛార్జిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లాకు MBNR మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ బండ ప్రకాష్ లను నియమించింది.
Similar News
News December 5, 2024
ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా సహచర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లతో పేదల కలను సాకారం చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
News December 5, 2024
జడ్చర్ల: బాలికను గర్భవతిని చేసిన యువకుడు
ఓ బాలిక(17)ను గర్భవతిని చేశాడు ఓ యువకుడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ తిరిగేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఆమెపై పలు సార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకొమని అడగగా మొహం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2024
నాగర్‌కర్నూల్: కుళ్లిపోయిన మహిళ మృతదేహం
అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రకారం.. NGKL జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన మరియమ్మ(40) తన భర్తతో భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా కుళ్లిన స్థితిలో మరియమ్మ మృతదేహం కనిపించింది. భర్తే హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.