News October 31, 2024

MBNR: దీపావళి: ఈ జాగ్రత్తలు మరవకండి.!

image

✓ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
✓ వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
✓ గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
✓ కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయండి.
✓ ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
> SHARE IT..

Similar News

News November 2, 2024

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి2/2

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన <<14512539>>కురుమూర్తి <<>>వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

News November 2, 2024

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

image

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట(M) <<14512550>>కురుమూర్తిలో<<>> ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ. 1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. #Way2News ప్రత్యేక కథనం.

News November 2, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల జిల్లా కల్లూరు తిమ్మందొడ్డిలో 33.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 33.7, వనపర్తి జిల్లా రేవల్లి లో 32.9, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.