News October 22, 2024

MBNR: ధన్వాడలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లా ధన్వాడలో అత్యధిక ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలుగా నమోదైంది. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో 36.4 డిగ్రీలు, గద్వాల జిల్లా అలంపూర్‌లో 35.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా సిరి వెంకటాపూర్లో 36.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలో 34.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 9, 2025

పాలమూరు:పంచరామాలకి ప్రత్యేక బస్

image

కార్తీక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక హైటెక్ బస్ నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ డిపో మేనేజర్ బి.సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈ నెల 15న ఉ. 7:00 గంటలకు మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి, APలోని పంచారామాలు దర్శన అనంతరం 17న మహబూబ్ నగర్‌కు చేరుకుంటుందన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ. 2400/-, పిల్లలకు రూ.1500/-, వివరాలకు 94411 62588, 99592 26286 సంప్రదించగలరు.

News November 9, 2025

హన్వాడ: సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

image

ఈ ఏడాదికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్‌ను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆ రైస్ మిల్లులపై కట్టిన చర్యలు తప్పవని అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. శనివారం హన్వాడ మండల పరిధిలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాదికి సంబంధించి సీఎంఆర్ పూర్తిగా చెల్లించని రైస్ మిల్లులకు కొత్తగా కోటాను కేటాయించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 8, 2025

మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

మహబూబ్ నగర్ నియోజకవర్గం మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. MBNR ఫస్ట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ శనివారం తెలిపారు.18 నుంచి 50 వయసు ఉండాలని 72079 88913, 72079 88914 సంప్రదించాలన్నారు.