News March 4, 2025
MBNR: నదిలో దూకి వివాహిత ఆత్మహత్య

దుందుభీనదిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. బాలానగర్ మం. గుండేడ్‌కి చెందిన లక్ష్మి(38)కి 17ఏళ్లక్రితం గంట్లవెల్లికి చెందిన లింగమయ్యతో వివాహమయ్యింది. పెళ్లప్పుడు రూ.1.50లక్షలు,4తులాల బంగారం,బైక్ కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత భర్త అదనపుకట్నానికి వేధించసాగాడు. దీంతో లక్ష్మి పుట్టింటికి రాగా.. భర్త ఇక్కడికొచ్చి గొడవచేయటంతో మనస్తాపానికి గురై నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News March 27, 2025
MBNR: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం పాలమూరు పరిధి MBNR, NRPT, GDWL, NGKL, WNP డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
MBNR: ఈనెల 31వ తేదీ తర్వాత గడువు పొడిగింపు ఉండదు: కలెక్టర్

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రాయితీ పొందాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటనలో అన్నారు. 31వ తేదీ తర్వాత ఎటువంటి గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్‌పై లేఅవుట్ డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్లు, సర్వేయర్లుగా ప్లాట్ల యజమానులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
News March 27, 2025
MBNR: సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయండి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు బుధవారం కలెక్టర్ మిడ్జిల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలపై ముందుగా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు.