News March 14, 2025

MBNR : నవవధువు సూసైడ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసులు వివరాలు.. కొందుర్గు మం. ఎన్కెపల్లికి చెందిన సుజాత(21)కు నవాబ్‌పేట మం. లింగంపల్లికి చెందిన రాములుతో గత నెల 7న పెళ్లైంది. కాగా పెళ్లికి రూ.6 లక్షలు అయ్యాయని అవి తీసుకురావాలని భర్త ఇబ్బంది పెట్టాడు. ఈక్రమంలో వెంకిర్యాలలో టీస్టాల్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకొచ్చిన సుజాత బాత్‌రూమ్‌లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI బాలస్వామి తెలిపారు.

Similar News

News March 21, 2025

బాసర: మహిళ ఆత్మహత్యాయత్నం

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన కొమ్ము సుమలత వారి ఇంటి వద్ద కనిపించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురువారం బాసర గోదావరి నదిలో దూకేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు.

News March 21, 2025

గుంటూరు మేయర్‌గా కోవెలమూడి?

image

గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేయడంతో నెక్స్ట్ మేయర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆశావహుల పేర్లలో కోవెలమూడి రవీంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం మేయర్ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పెమ్మసాని గుంటూరు వచ్చిన వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి మేయర్‌ని ఎన్నుకునే అవకాశముంది.

News March 21, 2025

రెంటచింతల: ఊయల తాడు బిగుసుకొని బాలుడి మృతి

image

ఊయల తాడు బిగుసుకొని ఓ బాలుడు మృతిచెందిన ఘటన రెంటచింతలలోని ఆంజనేయస్వామి మాన్యంలో జరిగింది. సలిబిండ్ల అద్విక్ రెడ్డి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న ఊయలలో అతివేగంతో ఊగగా తాడు మెలికలు పడి బాలుడి గొంతుకు బిగుసుకొని చనిపోయాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

error: Content is protected !!