News March 27, 2025
MBNR: నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ 6,9 తరగతుల ప్రవేశం కోసం జనవరి 18న పరీక్ష నిర్వహించారు. బుధవారం పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. 6వ తరగతిలో 75 మంది విద్యార్థులు, 9వ తరగతిలో 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల సమాచారం వ్యక్తిగతంగా సేకరిస్తామన్నారు.
Similar News
News November 24, 2025
19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News November 24, 2025
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లా ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఎస్పీ కార్యాలయంలో తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
News November 24, 2025
ధర్మేంద్ర బాలీవుడ్ ‘He-Man’ ఎలా అయ్యారంటే?

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్ అని నిక్ నేమ్ ఉంది. ధర్మేంద్రకు ఉన్న మస్క్యులర్ బాడీ, రగ్గ్డ్ లుక్స్, 1960-70ల మధ్య ఎక్కువగా యాక్షన్ పాత్రలు చేయడంతో ఆయనకు ఈ పేరు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి జానర్స్ కలుపుకుని దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర చివరిగా నటించిన ‘ఇక్కీస్’ అనే చిత్రం త్వరలో విడుదలకానుంది.


