News May 21, 2024
MBNR: నాటే సమయం వచ్చింది.. కానీ మొక్కలేవీ.. ?
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం కాలేకపోతున్నాయి. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి మూలంగా మొక్కల ఎదుగుదల కనిపించడంలేదు. సకాలంలో కలుపు తీయకపోవడమూ మరో కారణమని చెప్పవచ్చు. రూ.లక్షలు వెచ్చించి నర్సరీలు కొనసాగిస్తున్న ప్రయోజనం లేదని జిల్లావాసులు అంటున్నారు.
Similar News
News December 11, 2024
PU డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్.. ఈనెల 21 నుంచి పరీక్షలు
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.
News December 11, 2024
గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News December 11, 2024
మహబూబ్‌నగర్‌లో మృతదేహం కలకలం
గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ పక్కన రూం సమీపంలో ఓ వ్యక్తి చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. అతడి రెండు చేతులు కొట్టేసి ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే 8712659312, 8712659334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని 2-టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇది హత్యనా.. ప్రమాదమా తెలియాల్సి ఉంది.