News February 16, 2025
MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన MBNRలో శనివారం జరిగింది. స్థానికుల ప్రకారం.. ఓ కాలనీకి చెందిన ఖాజా(50) చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడి పక్కింట్లో ఉంటే బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇదిగమనించిన చిన్నారి తల్లి అరవడంతో స్థానికులు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడు పారిపోయాడు. పోక్సో కేసు నమోదైంది.
Similar News
News November 14, 2025
8 రోజులు క్రిస్మస్ సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.
News November 14, 2025
HYD: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తాం: DGP

ఎల్బీ స్టేడియంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు తలపెట్టిన Arrive Alive కార్యక్రమాన్ని DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్‌ను సినీ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
News November 14, 2025
విశాఖ: 400 MOUలు.. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐఅండ్‌ఐ, పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.


