News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News March 10, 2025
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం

తెలంగాణ భవన్‌లో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, BRS కార్యక్రమాలు, బీఆర్ఎస్ ఆవశ్యకతపై వివరణాత్మకంగా మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ సమావేశంలో మహిళా సంఘాలకు, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పిన మాటలకు పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
News March 10, 2025
KMR: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

కూతురును పుట్టిందన్న సంతోషంలో కామారెడ్డి జిల్లాలోని అత్తగారింటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం వాసి నరేశ్ (28)కు నెల క్రితం కూతురు పుట్టింది. బీబీపేట మండలం మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. కేసు నమైదైంది.
News March 10, 2025
నేడు యాదాద్రికి రానున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి విచ్చేసి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.