News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News July 6, 2025
కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.
News July 6, 2025
పార్వతీపురం: జిల్లాకు వచ్చిన నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్

అశావాహ జిల్లాగా గుర్తించిన పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ శనివారం వచ్చారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి సత్కరించారు. జిల్లాలో అశావాహ జిల్లాగా చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్స్&టీచర్స్ సమావేశం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 10న మెగా పేరెంట్&టీచర్స్ సమావేశంపై శనివారం సాయంత్రం కలెక్టర్ శ్యాం ప్రసాద్ వివరించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల కమిటీలు, పదోతరగతిలో ఉత్తమ ర్యాంకర్లు, పూర్వ విద్యార్థులు, తదితరులతో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేస్తోందని వెల్లడించారు. అంతా తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.