News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News January 7, 2026
సిరిసిల్ల: ‘పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
News January 7, 2026
సిద్దిపేట: ఆహారం భద్రంగా.. ఆరోగ్యం పదిలంగా !

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని, కల్తీలేని ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించేలా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
News January 7, 2026
పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.


