News November 22, 2024
MBNR: నియామక పత్రాలు అందజేయండి
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా JL అభ్యర్థులుగా ఎంపికైన వారు నియామక పత్రాల జారీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా జరుగుతున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా JL అభ్యర్థుల నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్ విద్యలో నాణ్యమైన విద్య అందించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొంటున్నారు.
Similar News
News November 23, 2024
ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: బీసీ కమిషన్ ఛైర్మన్
MBNR జిల్లా కలెక్టరేట్లో బీసీ కమిషన్ ఇవాళ నిర్వహించిన బహిరంగ విచారణలో బీసీ సంఘాలు, మైనార్టీ వర్గాల నుంచి స్వీకరించిన వినతులను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థల నుంచి 135 వినతులు ఆఫిడవిట్ రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
News November 22, 2024
ఉండవెల్లిలో వివాహిత సూసైడ్
వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లా ఉండవెల్లిలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన స్వాతికి రెండేళ్ల కిందట వివాహం అయ్యింది. తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చూయించుకుంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 22, 2024
NRPT: ‘మిడ్డే మీల్స్ మెనూ అమలు కావడం లేదు’
నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మిడ్డే మీల్స్ నిబంధనల ప్రకారం మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ అన్నం, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, గుడ్డు పెట్టాలి. కానీ ఎక్కడా అది అమలు కానీ పరిస్థితి నెలకొంది. వారంలో నాలుగు సార్లు మిడ్డే మీల్స్లో గుడ్డు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. గుడ్ల ధర పెరిగిన కారణంగా గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ వారు చెబుతున్నారు.