News November 26, 2024
MBNR: నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మల్లెబోయనపల్లిలోని నీటిశుద్ధి కేంద్రాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ EE వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిలతో ఆమె చర్చించారు. రాబోవు రోజులలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రిపేరులో ఉన్న బోరు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని ఆమె ఆదేశించారు.
Similar News
News December 14, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి ముఖ్య వార్తలు!
❤లగచర్లకు వెళ్తా..ఎవరోస్తారో చూస్తా:డీకే అరుణ
❤ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్లు
❤గద్వాల:హైవే- 44పై గడ్డి ట్రాక్టర్ దగ్దం
❤మర్రి జనార్దన్ రెడ్డికు ఈడీ నోటీసులు
❤కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:SFI
❤గ్రూప్-2..144 సెక్షన్ అమలు:SPలు
❤మధ్యాహ్న భోజనం..అధికారుల ఫోకస్
❤గండీడ్:ప్రేమను ఒప్పుకోలేదని యువకుడి సూసైడ్
❤కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు
News December 13, 2024
లగచర్లకు వెళ్తా.. ఎవరడ్డొస్తారో చూస్తా: డీకే అరుణ
గుండెనొప్పి సమస్య ఉందని చెప్పిన రైతు హిర్యానాయక్‌కు సంకెళ్లువేసి తీసుకెళ్తారా అని MP DK అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్‌కు పోలీసులు బేడీలువేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లకు వెళ్తానని ఎవరడ్డొస్తారో చూస్తానని పేర్కొన్నారు.
News December 13, 2024
లగచర్ల రైతుకు బేడీలు.. MBNR ఎంపీ ఫైర్
లగచర్ల కేసులో రైతుకు బేడీల వ్యవహారంపై MBNR ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఆమె నేడు ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏం తప్పు చేశాడని రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేశారు..? అమాయకులపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, సంకెళ్లు వేయడం ఇదేనా మీ ప్రజాపాలన అంటే అని ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడుకోవడం చేతగాక అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు.