News November 28, 2024

MBNR: నూనెపడి విద్యార్థినికి గాయాలు.. స్పెషల్ ఆఫీసర్ సస్పెన్షన్

image

నవాబ్‌పేటలోని కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి <<14727126>>విద్యార్థిని జల్సా <<>>పై వేడి నూనెపడి గాయాలైన గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తహాశీల్దార్ శ్రీనివాసులును విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా పాఠశాల ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ల కూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News December 12, 2025

MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

MBNR: గెలుపొందిన అభ్యర్థులకు డీజు సౌండ్‌తో ర్యాలీకి అనుమతి లేదు: ఎస్పీ డి.జానకి
@ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.
@రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి 31 ఓట్లతో గెలుపు.
@నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపు.
@రాజాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కావలి రామకృష్ణ 1104 భారీ మెజార్టీతో గెలుపు.

News December 11, 2025

రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

image

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.