News July 4, 2024
MBNR: నేటితో ముగియనున్న DOST గడువు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) మూడో విడత దరఖాస్తుకు జులై 4 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మూడో విడత సీట్ అలాట్మెంట్ JULY 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT
Similar News
News January 15, 2025
MBNR: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.!
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.❤️ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్.❤️ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ.❤️మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్.❤️మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్.❤️జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్.❤️జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.
News January 15, 2025
ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఇలా
నాగర్‌కర్నూల్ జిల్లా రంగాపూర్ సమీపంలోని ఉమామహేశ్వరుడి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఇలా..
✦ 15న నుంచి ప్రభోత్సవం, పల్లకీ సేవ
✦ 16న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం,
✦ 18న కుంకుమార్చన, రుద్రాభిషేకం, హోమం
✦ 19న ధ్వజారోహణం, త్రిశూల స్నానం తదితర పూజలు
✦ 16 నుంచి 22 వరకు పాపనాశనం వద్ద ఉత్తరాయణ పుణ్యకాల స్నానాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి.
News January 15, 2025
GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వట్టెం నవోదయ ప్రిన్సిపల్ పి.భాస్కర్ తెలిపారు. వెబ్‌సైట్ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.