News July 3, 2024

MBNR: నేటితో ముగియనున్న MPTCల పదవీ కాలం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 జులై 3న మండల పరిషత్ కొలువుదీరాయి. ఉమ్మడి  జిల్లాలో మొత్తం 719 మంది MPTCలు ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో సీసీ, డ్రైనేజీలకు కేటాయించారు. తమ డిమాండ్ల ఒక్కటీ నెరవేరలేదని, ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘునాథ్ పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

సల్కర్ పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో 12.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 13.3, మిడ్జిల్ మండలం దోనూరు 13.4, రాజాపూర్ 13.6, జడ్చర్ల 14.1, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, పారుపల్లి 14.7, భూత్పూర్ 14.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది.

News December 6, 2025

MBNR: ప్రభుత్వ ఉద్యోగులు.. ALERT!

image

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్‌లలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
#SHARE IT.

News December 5, 2025

MBNR: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యండి: కలెక్టర్

image

గ్రామపంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇప్పటివరకు ఫారం-14 (పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు) దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పంపడానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టిందని, మరో అవకాశంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
SHARE IT.