News December 28, 2024
MBNR: నేటి నుంచి ఉచిత శిక్షణ.. సద్వినియోగం చేసుకోండి
‘సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్& సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. MBNR, NGKL, GDWL, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు చెందిన గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిక్షణ మహబూబ్ నగర్ లోని బండమీదిపల్లి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో ఉంటుందన్నారు.
Similar News
News January 1, 2025
అమరచింత: జూరాల ప్రాజెక్టు నేటి సమాచారం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి నీటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు గాను ప్రస్తుతం 4.207 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌ఫ్లో 28 క్యూసెక్కులు రాగా.. ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
News January 1, 2025
MBNR: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బుధవారం HYD ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ప్రతినిధి వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News January 1, 2025
MBNR: నగ్న చిత్రాలు తీసి అత్యాచారం
ఓ మహిళ నగ్న చిత్రాలు తీసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన నవాబ్‌పేట మం.లో జరిగింది. SI విక్రమ్ వివరాలు.. ఓ మహిళ స్నానం చేస్తుండగా నర్సింహులు ఫొటోలు తీశాడు. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి వేధింపులు పెరగడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.