News March 22, 2025
MBNR: నేటి నుంచి ఐపీఎల్ షురూ.. జర జాగ్రత్త గురూ!

ఐపీఎల్ అంటేనే ఏమా క్రేజ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ పై బెట్టింగ్ పెడుతూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతేడాది పలువురు బెట్టింగ్ రాయుళ్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ పై మోజు పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.బెట్టింగ్ అని వచ్చే వారితో యువత జాగ్రత్తగా ఉండాలని, సమాచారం ఇవ్వాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 25, 2025
తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డ్!

తాడిపత్రి నియోజకవర్గంలోని YCP శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కీలక నేతలంతా యాక్టివ్‌గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలూ పెద్దగా జరగడంలేదు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తనను తాడిపత్రికి వెళ్లకూడదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 9నెలల నుంచి ఇదే సాగుతోంది. ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. మరోవైపు దూకుడుతో JC తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
News March 25, 2025
GDK: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోదావరిఖనికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
News March 25, 2025
పెనుగంచిప్రోలు: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సృజన్ కుమార్ కథనం మేరకు.. బత్తుల గోపి సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేయడానికొచ్చాడు. కాగా మద్యం తాగడం కోసం తన భార్యను రూ.200 అడగగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగగా.. గోపి మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.