News March 21, 2025
MBNR: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

నేటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 239 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 45,837 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అదనపు పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. SHARE IT
Similar News
News April 19, 2025
గన్నవరం: లారీ డ్రైవర్‌కు గుండె పోటు.. ఇద్దరి దుర్మరణం

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదం పాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
News April 19, 2025
అనకాపల్లి: జిల్లాలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

అనకాపల్లి జిల్లాలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భగ్గుమంటూ ఎండలు కాస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. శనివారం జిల్లాలో కొన్ని మండలాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
News April 19, 2025
VKB: దొంగల బెడదకు కాలనీవాసుల గస్తీ

వికారాబాద్ పట్టణంలోని మణికంఠ నగర్ కాలనీలో దొంగల బెడదకు కాలనీవాసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కాలనీలో రెండు వరస దొంగతనాలు జరిగిన నేపథ్యంలో కాలనీ వాసుల్లో దొంగల భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రిపూట భారీ కర్రలతో, రాడ్లతో, పైపులతో కాలనీవాసులు గస్తీ నిర్వహిస్తున్నారు.