News November 4, 2024
MBNR: నేటి నుంచి ప్రారంభం.. ఈ జిల్లాలో పత్తి అత్యధికం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. MBNR-2, NGKL-15, GDWL-1, WNPT-1, NRPT-5 జిల్లాలో పత్తి కేంద్రాలను అధికారులు అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోనే పత్తిని అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో పండిస్తారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే చర్యలు తప్పవని ఆయా జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News December 8, 2024
MBNR: ఓపెన్ ఇంటర్, టెన్త్.. APPLY చేసుకోండి
విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, SSC 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 వరకు ఫైన్ తో స్పెషల్ అడ్మిషన్లు పొందవచ్చని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు.
News December 8, 2024
MBNR: నేడు అథ్లెటిక్స్, యోగా క్రీడాకారుల ఎంపిక
పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు అథ్లెటిక్స్ యోగాలో స్త్రీ, పురుషుల విభాగంలో ఆదివారం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు PD శ్రీనివాసులు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో జంప్స్, రన్స్, త్రోస్.. యోగా విభాగంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు తదితర ఆసనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతో హాజరు కావాలన్నారు. PU పరిధిలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనవచ్చని చెప్పారు.
News December 8, 2024
ఏం ముఖం పెట్టుకొని సంబరాలు చేస్తున్నారు?: డీకే అరుణ
హైదరాబాద్ సరూర్‌నగర్ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని సంబరాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో రైతులను మభ్యపెట్టడానికి సోయి మరిచి సంబరాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.