News April 2, 2025
MBNR: నేటి నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ 1961 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎటువంటి మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. నిషేధిత కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదన్నారు. డీజేలు లౌడ్ స్పీకర్లను కూడా పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు.
Similar News
News April 4, 2025
మహబూబ్నగర్: ఘనంగా వేడుకలు నిర్వహించాలి: బీజేపీ

మహబూబ్నగర్లోని బీజేపీ జిల్లా ఆఫీస్లో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 13 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 14 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ, జనగణన, జమిలి ఎన్నికలు, రైతుల సమస్యలపై బూత్ కమిటీలు వేసి చర్చించాలని అన్నారు.
News April 4, 2025
MBNR: స్థానిక సంస్థల బరిలో పోటీకి యువత సై!

త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు యువత సిద్ధం అవుతోంది. ఓ వైపు ప్రభుత్వాలు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, మరో వైపు తమ సమస్యల పరిష్కారం కోసం తామే ఎన్నికల బరిలో నిలవాలని తలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే అన్ని పార్టీలు ఏ మేరకు వారికి సీట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.
News April 4, 2025
MBNR: ముగ్గురిపై కేసు నమోదు

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్తో బిల్డింగ్తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.