News February 21, 2025
MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
Similar News
News March 26, 2025
సిరిసిల్ల: ఏప్రిల్ 11లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల బాధితులు ఏప్రిల్ 11 లోపు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద ముంపునకు గురైన బాధితులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..
News March 26, 2025
మంత్రివర్గ విస్తరణకు వేళాయే

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.