News October 18, 2024
MBNR: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.
Similar News
News January 4, 2026
MBNR: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!

సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 4, 2026
జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.