News October 18, 2024
MBNR: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.
Similar News
News November 11, 2024
కల్వకుర్తి: తాండ్రలో నేడు సదర్ సమ్మేళనం
కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సదర్ సమ్మేళనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు తెలిపారు.
News November 11, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనాధగా మారిన ఇంటర్ విద్య
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో జిల్లా ఇంటర్ అధికారి (DIEO) పోస్టులు మంజూరు చేయాలని ఇంటర్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో ఎక్కడా జిల్లా ఇంటర్ అధికారి పోస్టులు మంజూరు కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌లతో నెట్టుకు వస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి ఇంటర్ విద్య గాడి తప్పుతోందని విమర్శలు ఉన్నాయి.
News November 11, 2024
నాగర్‌కర్నూల్: తల్లి, వదిన సహయంతో హత్య
అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. SI నరేందర్‌రెడ్డి వివరాలు.. తిమ్మాజిపేట(M) రాళ్లచెరువుకు చెందిన శీను(40), గోపాల్ అన్నదమ్ములు. అన్న భార్యతో గోపాల్ వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గోపాల్.. వదిన, తల్లి సహయంతో శీనును చంపేశాడు. మృతదేహాన్ని గోపాల్ అత్తగారింటి వద్ద పడేయటం చూసిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదైంది.