News April 2, 2025
MBNR: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే హాజరవుతారు.
Similar News
News October 20, 2025
BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 20, 2025
జూబ్లీహిల్స్: బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి చూపులేని వారి కోసం ప్రత్యేక ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులను రూపొందించారు. అంతేకాక పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ లిపిలోనే డమ్మీ బ్యాలెట్ షీట్ అందుబాటులో ఉంచుతున్నారు. దాన్ని గమనించి వారు ఓటు వేయొచ్చని జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
News October 20, 2025
రోజుకు 213 మందికి జన్మనిస్తున్న హైదరాబాద్

హైదరాబాద్.. మహానగరం దాదాపు కోటి మంది జనాభా ఉన్న సిటీ.. ఇక్కడ రోజూ వందలాది మంది పురుడుపోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనభ ఉన్న నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) నివేదికలో తేలింది. 2023వ సంవత్సరంలో సిటీలో 76,740 మంది జన్మించారు. అంటే సగటున నెలకు 6,395 మంది.. రోజుకు 213 మంది ఈలోకాన్ని చూశారన్న మాట.