News March 29, 2025
MBNR: నేడు సీఎం కొడంగల్ రాక.. షెడ్యూల్ ఇలా!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్కు రానున్నారు. పర్యటన షెడ్యూల్ ఖరారైంది.✔సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కొడంగల్కు రానున్నారు.✔4:40 గంటలకు హెలిప్యాడ్ నుంచి వెంకటేశ్వర ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు.✔4:40 నుంచి 5:40 వరకు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.✔సాయంత్రం 5.50 గంటల నుంచి 7 గంటల వరకు ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
Similar News
News December 11, 2025
సిద్దిపేట జిల్లాలో తొలి విజయం

సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాందాపూర్ సర్పంచిగా లింగాల మౌనిక ముత్యం విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నర్రా రవి మీద 321 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
News December 11, 2025
భారతీయులను పంపించడం సిగ్గుచేటు: ట్రంప్

అమెరికాలో టాప్ యూనివర్సిటీల్లో చదువు పూర్తిచేసుకున్న టాలెంటెడ్ ఇండియన్స్ దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఇది సిగ్గుచేటని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన కొత్త “<<18530951>>ట్రంప్ గోల్డ్ కార్డ్<<>>”ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆయన హైస్కిల్డ్ స్టూడెంట్స్కు ఉద్యోగం ఇచ్చి వారిని అమెరికాలోనే నిలుపుకోవడానికి ఇది కీలకమన్నారు. కంపెనీలు ఈ కార్డ్ కొనుగోలు చేయొచ్చని వివరించారు.
News December 11, 2025
పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలి: MP లావు

AP: రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను MP లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కేంద్రం AP పత్తి రైతులను ఆదుకోవాలి. ‘మొంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తేమశాతం ఎక్కువగా ఉన్న, రంగు మారిన పత్తిని కూడా CCI కొనుగోలు చేసేలా కేంద్రమే చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది.


