News February 23, 2025

MBNR: నేడే గురుకుల విద్యాలయాలకు ప్రవేశ పరీక్ష

image

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హాల్‌టికెట్లతో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో రావాలని సూచించారు. ఉ. 11 గం. నుంచి మ.1 గంట వరకు జరిగే పరీక్షకు ఉ.9 గం.లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2025

బాలానగర్‌‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

image

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 23, 2025

నాగర్‌కర్నూల్‌లో యువతి SUICIDE

image

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.

News February 22, 2025

MBNR: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

image

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్‌ఎల్‌బీసీ ఎడమగట్టు కాలువ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో అనేక మంది కార్మికులు గాయాలపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులను పునఃప్రారంభం చేశారు. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

error: Content is protected !!