News August 3, 2024
MBNR: ‘నేతన్నకు బీమా’దరఖాస్తుల ఆహ్వానం
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నేతన్నకు బీమా పథకం ప్రవేశ పెట్టిందని.. అర్హులైన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత,జౌళిశాఖ AD గోవిందయ్య తెలిపారు. వనపర్తి, NGKL, గద్వాల జిల్లాల పరిధిలో 18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు బీమా చేయించుకోవాలని చెప్పారు. ఈనెల 9వ తేదీ నాటికి దరఖాస్తులను ఏడీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కొత్తగా జియోట్యాగ్ నంబర్ వచ్చిన వారు కూడా అవకాశాన్ని పొందవచ్చని తెలిపారు.
Similar News
News September 9, 2024
రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు: డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.
News September 9, 2024
MBNR: అక్రమాలపై ప్రత్యేక హైడ్రా ఫోకస్.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.
News September 9, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 26.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా 21.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 14.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా నవబ్‌పేటలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.