News April 3, 2024
MBNR: నేతల మధ్య మాటల యుద్ధం.. వేడెక్కిన రాజకీయాలు

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ప్రధాన పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఒకరిపై మరొకరు చేసే విమర్శలు, ప్రతి విమర్శలతో పాలమూరులో ఉన్న 2 లోక్‌సభ నియోజకవర్గాలు రాజకీయంగా వేడెక్కుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే వ్యూహ రచనతో ఉన్న అభ్యర్థులు మాటల యుద్ధం చేస్తూ రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Similar News
News November 10, 2025
MBNR:FREE కోచింగ్.. అప్లై చేస్కోండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. ‘జూనియర్ బ్యూటీ పార్లర్ ప్రాక్టీషనర్’లో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు. SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 12లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.
News November 10, 2025
MBNR: సాఫ్ట్‌బాల్.. 2nd PLACE

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
News November 9, 2025
BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


