News March 29, 2025
MBNR: ‘న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలి’

వెనుకబడిన తరగతులకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బెంగళూర్‌లోనీ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల పెంపు, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్నారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల పెంపు అన్యాయం మాత్రమే కాదు, సమాన ప్రాతినిధ్యం ప్రధాన సూత్రాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.
Similar News
News December 19, 2025
MBNR: సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు

మహబూబ్ నగర్ లోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే ‘ఫుట్ బాల్’ (పురుషుల) జట్ల ఎంపికలను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఉంటాయన్నారు.
News December 19, 2025
పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT
News December 19, 2025
MBNR: నేడు సౌత్ జోన్ టేబుల్ టెన్నిస్ ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను శుక్రవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఎంపికలు పాలమూరు యూనివర్సిటీలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు.


