News December 1, 2024

MBNR: పంచాయతీ ఎన్నికలు.. యువత గురి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై యువత ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం కూడా ఈసారి యువతకు అవకాశం కనిపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి. జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 14, 2025

MBNR: నేటి నుంచి మహానగరోత్సవం 

image

జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నేడు, రేపు ‘మన మహబూబ్ నగర్ మన మహానగరోత్సవం’ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌గా ఏర్పాటైనా సందర్భంగా నగర ప్రముఖులు, ప్రజలందరూ వారి అనుభవాలు మహానగరోత్సవం వేదికగా వ్యక్త పరచనున్నారు. ప్రముఖ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

News February 14, 2025

బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.

News February 14, 2025

మహబూబ్‌నగర్ RTC బస్సుకు రోడ్డు ప్రమాదం

image

మహబూబ్‌నగర్ డిపోకు చెందిన బస్సుకు షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!