News March 31, 2025

MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..! 

image

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్‌నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు. 

Similar News

News November 24, 2025

MBNR: 110 పోగొట్టుకున్న ఫోన్లు స్వాధీనం

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొత్తం 110 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ (Central Equipment Identity Register) సహకారంతో ట్రేస్ చేసి, సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో బాధితులకు అందజేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News November 24, 2025

మిడ్జిల్: రోడ్డుపై భారీ గుంత.. సూచికగా చెట్ల కొమ్ములు

image

మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామ రహదారిపై భారీగా గుంత పడింది. ఇటీవల ఈ రోడ్డు ఘోర యాక్సిడెంట్ జరిగి ఒక మహిళా చనిపోయింది. ఇది గమనించిన మల్లాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల మధు పక్కనే ఉన్న చెట్లు కొమ్ములు గుర్తుగా పెట్టారు. చిన్న రోడ్లలో ప్రమాదాలకు ఈ గుంతలే అధికంగా కారణమవుతున్నాయని అన్నారు. మీ పరిసరాలలో ఎక్కడైనా రోడ్లపై ఇలాంటివి కనిపిస్తే ఏదైనా సూచికగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

News November 24, 2025

జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. 167 జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.