News March 19, 2025
MBNR: పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి

రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా అభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడ్జెట్పై మంత్రి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్ శక్తి ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయన్నారు.
Similar News
News November 14, 2025
సిరిసిల్ల: గైనకాలజిస్ట్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి: కలెక్టర్

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీఎంహెచ్ఓ రజిత పాల్గొన్నారు.
News November 14, 2025
వనపర్తి: రణభేరి సభ గోడపత్రిక ఆవిష్కరణ

పాలమూరులో ఈనెల 23న జరగనున్న “బీసీల రణభేరి” బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ జెఎసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీసీ నాయకులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: పడిపోయిన BJP ఓట్ల శాతం!

గత ఎన్నికతో పోల్చితే BJP ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికలో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 14.11 శాతం అంటే 25,866 ఓట్లు వచ్చాయి. ఈ ఉపఎన్నికలోనూ BJP తరఫున లంకల దీపక్ రెడ్డే పోటీ చేయగా కేవలం 8.76 శాతం అంటే 17,061 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ గల్లంతైంది. అంటే గత ఎన్నికతో పోల్చితే 8,805 ఓట్లు తగ్గాయి. కాగా రెండు సార్లు BJP మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం.


