News September 12, 2024
MBNR: పనిచేయని బయోమెట్రిక్ హాజరు పరికరాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Similar News
News December 10, 2025
MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.
News December 10, 2025
MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

మహబూబ్నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.


