News September 8, 2024
MBNR: పనిచేయని సీసీ కెమెరాలు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.
Similar News
News October 10, 2024
మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <
News October 10, 2024
కొడంగల్: నాన్నకు ప్రేమతో..!
కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.
News October 10, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా భద్రలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 21.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 18.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.