News March 22, 2025

MBNR: పరిశ్రమల అనుమతులు తక్షణమే మంజూరు: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖలు మంజూరు చేయ్యాల్సిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అదికారులను ఆదేశించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

MBNR: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులకు గడువు పెంపు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటన ద్వారా వెలడించారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. వివరాలకు 77309 09838 నంబర్ సంప్రదించాలన్నారు.

News November 15, 2025

పాలమూరు: పీయూలో యాంటీ ర్యాగింగ్ అవగాహన

image

పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, బీఎఎస్ చట్టంలోని కఠిన సెక్షన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా డి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 15, 2025

MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.