News March 21, 2025
MBNR: పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 24 వరకు పెంపు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలలో 2వ, 4వ&6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వరకు గడువు ముగియనుండగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 24వరకు, ఆలస్య రుసుముతో ఈనెల 27 వరకు గడువు పెంచుతున్నట్లు కాలేజీలకు అధికారులు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థుల నిమిత్తమే ఫీజు చెల్లింపు గడువు పెంచినందుకు డిగ్రీ విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. SHARE IT.
Similar News
News December 7, 2025
అంతనపురం మహిళా నేతకు కీలక పదవి

బీజేపీ మహిళా మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన సౌభాగ్య నియామకమయ్యారు. ఈ మేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు నియామక పత్రం శనివారం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సౌభాగ్య చెప్పారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.
News December 7, 2025
న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.
News December 7, 2025
NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

నిజామాబాద్ శివారులోని గూపన్పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.


