News February 2, 2025

MBNR: పరీక్షల షెడ్యూల్‌ విడుదల

image

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.

Similar News

News October 26, 2025

జానపదుల గాథల్లో కురుమూర్తి స్వామి

image

కురుమూర్తి ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నేటి మక్తల్‌గా పిలవబడుతున్న మగతలనాడుని పాలిస్తున్న ముక్కెర గోపాల్ రెడ్డి కాలంలో వెలుగు చూసింది. అప్పటికి ఇంకా సంస్థానం ఏర్పడలేదు. అయినప్పటికీ స్థానిక పసుల కాపర్లు, గొర్రెల కాపర్లు గుట్ట మీద గుహలో కురుమతి రాయుడిని పూజిస్తున్నట్టుగా జానపద ఆధ్యాత్మిక కథలు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి రాజుల కాలానికి ముందే జానపదుల గాథలు ప్రచారంలో ఉన్నాయనేది స్పష్టమవుతుంది.

News October 26, 2025

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

image

★ మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి
★ శ్రమించి పనిచేసే వారికి సర్వసంపదలు చేకూరుతాయి
★ చక్కెరలో నీటిని కలిపినప్పుడు పానకం అవుతుంది, దైవనామ స్మరణతో ప్రేమను కూర్చినప్పుడు అది అమృతం అవుతుంది.

News October 26, 2025

నల్లరంగు వల్ల బైకును గుర్తించలేకపోయా: డ్రైవర్

image

AP: రోడ్డుపై పడిన <<18102090>>బైక్<<>> నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.