News February 2, 2025
MBNR: పరీక్షల షెడ్యూల్ విడుదల

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.
Similar News
News February 12, 2025
నెక్కొండలో అత్యధికం.. నర్సంపేటలో అత్యల్పం

వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం నెక్కొండ మండలంలో 81 పోలింగ్ కేంద్రాలు, రాయపర్తిలో 78, పర్వతగిరి-68, సంగెం-66, దుగ్గొండి-65, చెన్నారావుపేట-55, నల్లబెల్లి-53, గీసుకొండ-48, ఖానాపురం-48, వర్ధన్నపేట-47, నర్సంపేట మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
News February 12, 2025
ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
News February 12, 2025
హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: హరీశ్

TG: రాష్ట్రవ్యాప్తంగా 16వేల మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.