News July 11, 2024
MBNR: పాతాళానికి భూగర్భ జలాలు

ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలమట్టం నానాటికీ తగ్గిపోతోంది. వర్షాకాలం ప్రారంభమైనా జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెరగడం లేదు. గత నెల ఉమ్మడి జిల్లాలో సగటున 9.33 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది జూన్లో భూగర్భ జలాలు 7.09 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 2.24 మీటర్ల లోతులోకి ఇవి పడిపోయాయి. కృష్ణా పరివాహక ప్రాంతమైన GDWL, WNP, NGKL జిల్లాల్లో కూడా భూగర్భ జలాల పెరుగుదల కనిపించలేదు.
Similar News
News February 15, 2025
MBNR: మినీ మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి రాక

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఖరారైంది. పోలేపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.
News February 15, 2025
MBNR: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన షాలు(45) అడ్డాకులలో ఉంటూ రాళ్లు కొడతూ జీవిస్తున్నారు. అడ్డాకుల వైపు నుంచి వచ్చిన పొక్లెయిన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్(32) అక్కడికక్కడే మృతిచెందగా.. షాలుకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాలు శుక్రవారం మృతిచెందారు.
News February 15, 2025
జోగులాంబ: పంచాయతీ కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB

ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ACB DSP బాలకృష్ణ కథనం మేరకు DPO శ్యామ్ సుందర్ సూచనతో ఒక వెంచర్ మేనేజర్ తో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. DPO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.