News February 25, 2025

MBNR: పాన్ షాప్‌లపై గట్టినిఘా: అదనపు కలెక్టర్

image

మాదకద్రవ్వాల నియంత్రణకై జిల్లా వ్యాప్తంగా డ్రాగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పాన్‌షాప్‌లపై గట్టి నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో దాడులపై సమీక్ష నిర్వహించారు. డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వాటిని విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Similar News

News December 5, 2025

నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులతో పోలిస్తే.. చలి తీవ్రత కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 18.4, రాజాపూర్ 18.7, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9, మహమ్మదాబాద్, హన్వాడ 19.5, జడ్చర్ల 20.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News December 5, 2025

MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

image

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.

News December 5, 2025

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

image

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.