News February 3, 2025

MBNR: పాలమూరులో కాంగ్రెస్ నేతల నిరసన

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పైన సవతి తల్లి ప్రేమ చూపించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News

News May 8, 2025

మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

image

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.