News February 26, 2026
MBNR: పాలమూరు యూనివర్సిటీ.. ఫలితాలు విడుదల

MBNR జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ VII-సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఫలితాలను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 69.39% ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ, డాక్టర్ ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News April 15, 2026
కరీంనగర్‌లో ఠాగూర్ సీన్ రిపీట్..!

KNRలో ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీటైంది. వేములవాడ(M) శాత్రాజ్‌పల్లికి చెందిన సాహెబ్ బీ(60) గుండెవ్యాధితో కోర్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్న సర్జరీ చేయగా మృతిచెందింది. బతికే ఉన్నట్లు, వైద్యం చేస్తున్నట్లు కుటుంబసభ్యులను మభ్యపెడుతుండగా, అనుమానంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. డాక్టర్లపై KNR-2 టౌన్ PSలో కేసు నమోదైంది.
News April 15, 2026
నేడు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరులో CHC ప్రారంభం, పెనుబల్లిలో ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం వేంసూరు మండలంలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు.
News April 15, 2026
WGL: ఆరు స్థానాలు పెరగడం పక్కా!

ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 6 కొత్తవి రావడం పక్కాగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 35,12,576 మంది కాగా, 17,59,772 పురుషులు, 17,53,295 మహిళలున్నారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా, కొత్తవి 6 రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉన్న 12 స్థానాల్లోని జనరల్ స్థానాలన్నీ మహిళలకు, రిజర్వు స్థానాలు జనరల్‌గా మారడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నేతలు వాటిపై గురి పెడుతున్నారు.


