News January 30, 2025
MBNR: పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

పాలమూరు యూనివర్సిటీ(పీయూ) డిగ్రీ- I, III & V ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.ఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.palamuruuniversity.com వెబ్ సైట్లో పొందుపరచామన్నారు. సెమిస్టర్-Iలో 32.61%, సెమిస్టర్-IIIలో 37.75%, సెమిస్టర్-Vలో 48.81% మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప, పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజ్ కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 2, 2025
కోరుట్ల: ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం: డిఎం

ప్రైవేటు వాహనాలలో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం, శుభప్రదమని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ ఆదివారం అన్నారు. కోరుట్ల నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు, కోరుట్ల నుండి కనిగిరి పామూరుకు ప్రతిరోజు 4 బస్సులు నడుస్తున్నాయన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని ట్రిప్పులను పెంచుతామన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఎన్నో చర్యలను తీసుకుంటుందన్నారు.
News November 2, 2025
పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జిల్లాలోని ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎంహెచ్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. డీఎంపీహెచ్ఎ(మేల్), డీఎంఎల్, డీఓఏ, డీఏఎన్ఎస్, డీఎంఐటీ, డీఆర్జీఏ, డీఓఎం, డీఈసీజీ, డయాలసిస్, డిఎంఎస్టీతో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 2, 2025
మన్యం: ‘మీ కోసం వెబ్సైట్లో PGRS నమోదు చేయవచ్చు’

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో PGRS ద్వారా సోమవారం అర్జీలు స్వీకరిస్తామన్నారు.


