News March 14, 2025

MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

image

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 2, 2025

Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్‌ఫాస్ట్’

image

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్‌‌ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

News December 2, 2025

నల్గొండ: సర్పంచి గిరీ కోసం.. రూ.లక్షల్లో ఖర్చు!

image

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు, ఆశావహులు ఓట్ల వేటలో స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూములు, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.నాలుగైదు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మామూలు పంచాయతీలో రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల దాకా.. పెద్ద పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు.

News December 2, 2025

‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

image

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్‌ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.