News March 14, 2025

MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

image

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

ADB: కేసీఆర్ ‘జైత్రయాత్ర’.. మారనున్న సమీకరణాలు..?

image

ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న ‘జైత్రయాత్ర’ బహిరంగ సభతో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కేసీఆర్ సమక్షంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సాకుతో కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త నేతలను ఆకర్షించడంపై గులాబీ దళం దృష్టి పెట్టింది. జీవన్ రెడ్డి చేరికతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తోంది.

News April 17, 2026

ఈ నెల 22న టీయూలో అన్యువల్ డే

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న అన్యువల్ డే నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది తెలంగాణ విశ్వవిద్యాలయ అన్యువల్ డేకి హాజరుకావాలని ఆదేశించారు. సంవత్సరంలో జరిగిన ప్రగతిని నివేదించడంతో పాటు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, విద్యార్థుల భవిష్యత్తుపై మార్గ నిర్దేశం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 17, 2026

TU: పాలకమండలి సభ్యుడిని అభినందించిన TUTA

image

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) ఆయన్ను శుక్రవారం అభినందించింది. ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిలకు కృతజ్ఞతలు తెలిపారు.