News March 14, 2025
MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 15, 2025
NZB: గంజాయి అమ్ముతున్న యువకుడి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని NGOs కాలనీలో గంజాయి అమ్ముతున్న కోడె సంపంత్ (24)ను నిన్న రాత్రి త్రీ టౌన్ ఎస్సై హరిబాబు అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడి చేసి నిందితుడిని పట్టుకుని అతడి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News March 15, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
News March 15, 2025
చిన్న సినిమా.. తొలిరోజే భారీ కలెక్షన్లు

చిన్న సినిమాగా విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇందులో షేర్ దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు కాగా ఫస్ట్ డేనే సగానికి పైగా రికవరీ చేయడం విశేషం. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.