News March 30, 2025
MBNR: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితం తీపి, చేదుల సమ్మేళనం అయినప్పటికీ కూడా అవన్నీ మన అభ్యున్నతికి పునాదులుగా నిలవాలన్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా పండగలు చేసుకోవాలని సూచించారు. రైతాంగానికి సంపూర్ణమైన ఫలితాలు దక్కి రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో పురోగతి సాధించాలని కాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.
Similar News
News February 24, 2026
జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.
News February 24, 2026
MBNR: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు!

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.
News February 24, 2026
జడ్చర్ల: భార్యభర్తల గొడ.. కత్తితో దాడి

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.


